Washington State

Office of the Attorney General

Attorney General

Nick Brown

ద్వేషం గురించి నివేదించండి. మద్దతు పొందండి.

అది మీకు జరిగినా లేదా వేరొకరికి జరిగినా, ఈ విషయంలో మీరు ఒంటరివాళ్లు కాదు: ద్వేషం గురించి నివేదించడానికి, మీకు అవసరమైన మద్దతు పొందడానికి మీ కోసం మేము ఉన్నాం.

అత్యవసరంకానివి

Hate Crimes & Bias Incidents Hotline

పసిఫిక్ టైమ్‌లో ఉద. 9 గం. నుండి సా. 5 గం. వరకు ట్రామా గురించి తెలిసిన ఆపరేటర్లు అందుబాటులో ఉంటారు.

240 కన్నా ఎక్కువ భాషల్లో అనువాద సేవలు అందుబాటులో ఉన్నాయి.

అన్ని రిలే కాల్స్‌ని మేము అంగీకరిస్తాము.

ఆన్‌లైన్ ద్వారా మీరు ఎప్పుడైనా మాకు నివేదించవచ్చు:

ద్వేష నేరం లేదా వివక్ష సంఘటన గురించి నివేదించండి (ఇంగ్లీషు)

ద్వేషం గురించి నివేదించండి. మద్దతు పొందండి.

ఇతర ప్రాంతాల్లో లాగే, వాషింగ్టన్‌లోని సమాజాలు సైతం ద్వేషం, వివక్ష బారినపడుతున్నాయి. Federal Bureau of Investigation (FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ప్రకారం, 2018 నుండి ద్వేష సంబంధిత నేరాలు అత్యధికంగా నివేదించబడుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో వాషింగ్టన్ ఒకటి. ఈ తరహా సంఘటనలు ప్రజలను తీవ్రంగా బాధించవచ్చు, తమ సొంత సమాజాల్లో తాము సురక్షితంగా లేమని వాళ్లకు అనిపించవచ్చు లేదా తమ అవసరం లేదని వాళ్లకు అనిపించవచ్చు. ద్వేష సంబంధిత నేరాలు మరియు వివక్ష సంఘటనలు అన్ని సందర్భాల్లో నివేదించబడవు కాబట్టి, అవి ఎంత ఎక్కువగా జరుగుతున్నాయనే పూర్తి సమాచారం మా వద్ద లేదు. వాషింగ్టన్ అందరినీ స్వాగతించేదిగా, అందరినీ కలుపుకునేదిగా, అందరికీ సురక్షితమైనదిగా ఉండాలన్నది మా కోరిక.

Hate Crimes & Bias Incidents Hotline (ద్వేష సంబంధిత నేరాలు మరియు వివక్ష సంఘటనల హాట్‌లైన్)లో మీరు ద్వేష సంఘటన గురించి నివేదించి మద్దతు పొందవచ్చు. బాధితులకు మద్దతు ఇవ్వడంతో పాటు ద్వేష సంబంధిత నేరాలు మరియు వివక్ష సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడమే ఈ హాట్‌లైన్ లక్ష్యం. మేము ఇవి చేయాలనుకుంటున్నాము:

  • ద్వేష సంబంధిత నేరాలను, వివక్ష సంఘటనలను చూసినవాళ్లకు లేదా వాటిని ఎదుర్కొన్నవాళ్లకు మద్దతు ఇవ్వడం.
  • అలాంటివాళ్లకు సహాయం అందించే సేవల గురించి చెప్పడం. మేము పోలీసులం కాదు, మీరు సమ్మతిస్తే తప్ప, సంఘటన గురించి మేము పోలీసులకు నివేదించము.
  • సమస్య తీవ్రత గురించి వాషింగ్టన్ శాసనసభ, గవర్నర్, చట్టాన్ని అమలు చేసే సంస్థ మరియు సమాజానికి తెలియజేస్తాము.

ఈ హాట్‌లైన్ అనేది ఒక అత్యవసరంకాని రిపోర్టింగ్ లైన్‌. ప్రస్తుతం, ఏదైనా ప్రమాదకర సంఘటన జరుగుతుంటే, దయచేసి 911కి కాల్ చేయండి.

హాట్‌లైన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. (ఇంగ్లీషు)

వాషింగ్టన్ ద్వేష సంబంధిత నేరాలు మరియు వివక్ష సంఘటన చట్టాల చరిత్ర

వాషింగ్టన్‌లో గతంలో అలాగే ప్రస్తుతం ఉన్న ద్వేష సంబంధిత నేరాలు మరియు వివక్ష సంఘటన చట్టాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. (ఇంగ్లీషు)

ఏదైనా ద్వేష సంబంధిత నేరం లేదా వివక్ష సంఘటనను మీరు ఎదుర్కొన్నారా లేదంటే దాన్ని చూశారా?

వాషింగ్టన్ చట్టం ప్రకారం, ద్వేష సంబంధిత నేరం aఅంటే, ఒక వ్యక్తి ఫలానా జాతి, రంగు, మతం, వంశం, జాతీయ మూలం, లింగం, లైంగిక ధోరణి, లింగ వ్యక్తీకరణ లేదా గుర్తింపు ఉన్నవాడని అనుకొని లేదా మానసిక, శారీరక లేదా ఇంద్రియ వైకల్యం ఉందని అనుకొని, ఆ వ్యక్తి మీద విద్వేషంతో, ఉద్దేశపూర్వకంగా నిజంగానే దాడి చేయడం లేదా దాడిచేస్తామని బెదిరించడం లేదా ఆ వ్యక్తి ఆస్తికి భౌతిక నష్టం కలిగించడం అని అర్థం.

  • వీటిలో ఈ అంశాలు కూడా ఉండవచ్చు: ఎదుటి వ్యక్తికి శారీరక గాయం చేయడం లేదా దాడి చేయడం
  • ఆస్తి నష్టం
  • శారీరక గాయం లేదా ఆస్తి నష్టం జరుగుతుందేమో అనే "సహేతుక భయం" ఎదుటి వ్యక్తిలో లేదా వ్యక్తుల గుంపులో కలిగించే విధంగా బెదిరింపులు

వాషింగ్టన్ చట్టం ప్రకారం, వివక్ష సంఘటన అంటే, ఎదుటి వ్యక్తి నిజంగానే ఫలానా జాతి, రంగు, మతం, సాంప్రదాయం, వంశం, జాతీయ మూలం, పౌరసత్వం లేదా వలస హోదా, లింగం, లైంగికత, లైంగిక ధోరణి, లింగ వ్యక్తీకరణ లేదా గుర్తింపు, మానసిక, శారీరక లేదా ఇంద్రియ వైకల్యం, శిక్షణ పొందిన శునకాన్ని మార్గదర్శనం కోసం ఉపయోగిస్తుండడం లేదా సర్వీస్ జంతువు వినియోగిస్తుండడం లేదా గౌరవంగా డిశ్చార్జ్ చేయబడిన వెటరన్ లేదా సైనిక హోదా ఉంది కాబట్టి లేదా ఉన్నాయని అనుకొని, ఆ వ్యక్తి పట్ల ద్వేష నేరం అనే స్థాయికి చేరని పగ లేదా విద్వేషం చూపించడం అని అర్థం. వివక్ష సంఘటనలకు ఉదాహరణలు కొన్ని ఇలా ఉంటాయి, అవి వీటికే పరిమితం కాదు:

  • ఎదుటి వ్యక్తికి ఫలానా జాతి, లైంగికత, మతం లేదా ఇతర రక్షిత గుర్తింపు ఉంది కాబట్టి లేదా ఉన్నాయని అనుకొని వారి పట్ల అవమానకర భాష ఉపయోగించడం.
  • ఎదుటి వ్యక్తికి ఫలానా జాతి, లైంగికత, మతం లేదా ఇతర రక్షిత గుర్తింపు ఉంది కాబట్టి లేదా ఉన్నాయని అనుకొని జాత్యాహంకార బొమ్మలను లేదా చిత్రాలను గీయడం.
  • వైకల్యంతో ఉన్న వ్యక్తిని లేదా ఎదుటి వ్యక్తి సాంస్కృతిక కట్టుబాట్లను లేదా అలవాట్లను ఎగతాళి చేయడం.
ద్వేష సంబంధిత నేరం మరియు వివక్ష సంఘటన మధ్య వ్యత్యాసం గురించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. (ఇంగ్లీషు)