ఆగస్ట్ 12, 2025
రాష్ట్రవ్యాప్త ద్వేష సంబంధిత నేరాలు మరియు వివక్ష సంఘటనల హాట్‌లైన్ ఇప్పుడు క్లార్క్, కింగ్ మరియు స్పోకేన్ కౌంటీల్లో యాక్టివ్‌గా ఉంది
సియాటిల్ - వాషింగ్టన్ రాష్ట్రవ్యాప్తంగా మూడు కౌంటీల్లో ద్వేష సంబంధిత నేరాల మరియు వివక్ష సంఘటనల హాట్‌లైన్ పరీక్షను ప్రారంభించింది. Federal Bureau of Investigation (FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) వారి ద్వేష సంబంధిత నేర గణాంకాల ప్రకారం, 2018 నుండి ద్వేష సంబంధిత నేరాలు అత్యధికంగా నివేదించబడుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో వాషింగ్టన్ ఒకటి. క్లార్క్, కింగ్ మరియు స్పోకేన్ కౌంటీల్లోని ప్రజలు తాము ఎదుర్కొనే ద్వేష సంబంధిత నేరాలను లేదా వివక్ష సంఘటనలను నివేదించడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అత్యవసరంకాని హాట్‌లైన్ అందిస్తోంది.
ద్వేష సంబంధిత నేరాలు, వివక్ష సంఘటనలనేవి ఆయా వ్యక్తుల, కుటుంబాల, అలాగే సమాజాల మీద వినాశకర, దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. ఫలితంగా, తాము ఉంటున్న ప్రాంతాల్లో తమ అవసరం లేదని లేదా సురక్షితంగా లేమని వాళ్లకు అనిపిస్తుంది. స్థానికులైన, సాంస్కృతికంగా సమర్థులైన, పూర్తిగా బాధితులకు సహాయం చేసే, ట్రామా గురించి తెలిసిన మద్దతు సేవలందించే వారిని సంప్రదించడానికి కాలర్లకు హాట్‌లైన్ సిబ్బంది సహాయం చేస్తారు మరియు కాలర్ సమ్మతితో, ఆ సంఘటనలు గురించి స్థానికంగా చట్ట అమలు చేసేవాళ్లకు నివేదించడంలో సహాయపడగలరు.
1-855-225-1010కి కాల్ చేయడం ద్వారా హాట్‌లైన్‌ని సంప్రదించవచ్చు. ద్వేష నేరం లేదా వివక్ష సంఘటన గురించి మూడు పరీక్ష కౌంటీల్లో నివేదించాలనుకునేవాళ్లు atg.wa.gov/report-hate ను కూడా సంప్రదించవచ్చు.
2024లో, ఇరు పక్షాల మద్దతుతో Senate Bill (సెనేట్ బిల్లు) 5427 (ఇంగ్లీషు) ఆమోదం పొందినప్పుడు, Legislature (చట్టసభ) ఈ హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ బిల్లు ప్రకారం, తూర్పు వాషింగ్టన్‌లో ఒక దానితో సహా వాషింగ్టన్ రాష్ట్రంలోని మూడు కౌంటీల్లో హాట్‌లైన్ నడపడానికి Attorney General’s Office (అటార్నీ జనరల్ ఆఫీస్) ఆధ్వర్యంలో నడిచే ఒక పైలెట్ లేదా పరీక్ష ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. 2023 Washington Association of Sheriffs and Police Chiefs’ Annual Crime Report (వార్షిక నేర నివేదిక) మరియు కౌంటీల జన గణనలో అందుబాటులో ఉన్న ద్వేష సంబంధిత నేరాల డేటా ఆధారంగా ఈ మూడు కౌంటీలను ఎంపిక చేశారు.
ఈ పైలట్ కార్యక్రమం ఏడాదిన్నర కాలంపాటు క్రియాశీలకంగా ఉంటుంది. ఆ తర్వాత, జనవరి 2027 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌లైన్ ప్రారంభించబడుతుంది. ద్వేష సంబంధిత నేరాలు, అలాగే వివక్ష సంఘటనలు ఎక్కువభాగం నివేదించబడవు కాబట్టి, వాటి తీవ్రత గురించిన డేటా పరిమితంగానే ఉంటుంది. జూలై 1, 2027 నుండి, Attorney General’s Office ఒక వార్షిక నివేదిక రూపొందిస్తుంది. గవర్నర్, రాష్ట్ర Legislature అలాగే ప్రజల కోసం తయారుచేసే ఆ నివేదికలో ద్వేష సంబంధిత నేరాలకు, వివక్ష సంఘటనలకు సంబంధించిన హాట్‌లైన్ నివేదికల ఆధారంగా సేకరించిన డేటా వివరణ ఉంటుంది.
"ద్వేష సంబంధిత నేరాలనేవి ఆయా వ్యక్తులకు నేరుగా హాని కలిగించడమే కాదు, సమాజం అంతటికీ అవి హాని కలిగిస్తాయి" అని అటార్నీ జనరల్ Nick Brown అన్నారు. “ఈ మూడు కౌంటీల్లో లభించే విజయం వల్ల మేము ఈ హాట్‌లైన్‌ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించగలుగుతాం, అలాగే ద్వేష సంబంధిత నేరాలు మరియు వివక్ష సంఘటనలను వాషింగ్టన్ వ్యాప్తంగా ఎలా ఎదుర్కోవాలో మరింతగా అర్థం చేసుకోగలుగుతాం” అని ఆయన అన్నారు.
హాట్‌లైన్ పైలెట్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా, సలహా బృందం సభ్యులు, స్థానిక అధికారులు ఈ ప్రకటనలు చేశారు:
"మా ద్వేష సంబంధిత నేరాల చట్టాలు మార్చడం ద్వారా, 2019లో మేము ఒక కీలక అడుగు వేశాము — అయితే, ద్వేషం అలాగే వివక్ష సంఘటనల్లో పెరుగుదల అనేది వాటి విషయంలో చేయాల్సింది చాలా ఉందని చూపిస్తోంది" అని హాట్‌లైన్ రూపకల్పన చట్టాన్ని స్పాన్సర్ చేసిన D-Seattleకి చెందిన సెనేటర్ Javier Valdez అన్నారు. “అందుకే, ఈ హాట్‌లైన్ చాలా కీలకమైనది. కేవలం పాలసీ ఒక్కటే లక్ష్యం కాదు — ప్రజల గురించిన ఆలోచనే దీని లక్ష్యం. బాధితుల్లో ప్రతిఒక్కరి ఆందోళన విని, వారికి మద్దతు ఇవ్వాలనే ఆలోచనా దీనిలో ఉంది.”
“ప్రతికూలంగా ఉన్న ఫెడరల్ అడ్మినిస్ట్రేన్ దుర్బల సమాజాల మీద అసహనాన్ని పెంచిపోషిస్తున్న సమయంలో, కింగ్ కౌంటీలో చాలామంది భయంతో, అనిశ్చితితో జీవిస్తున్నారు" అని కింగ్ కౌంటీ కౌన్సిల్ చైర్ Girmay Zahilay అన్నారు. “Attorney General’s Office తో కలిసి ఈ కార్యక్రమంలో భాగం వహించడం నేను గర్వకారణంగా భావిస్తున్నాను, ఈ కార్యక్రమ ప్రారంభానికి దోహదపడిన కమ్యూనిటీ నాయకులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం కలసి, ద్వేషం మీద కలసికట్టుగా పోరాడుదాం” అని ఆయన అన్నారు.
"కొత్తగా ఈ Hate Crimes & Bias Incidents Hotline (ద్వేష సంబంధిత నేరాలు మరియు వివక్ష సంఘటనల హాట్‌లైన్) ప్రారంభించడాన్ని స్పోకేన్ స్వాగతిస్తోంది, అలాగే మొదటి మూడు పరీక్షా లొకేషన్లలో మాది ఒకటిగా ఉండడం మాకు గర్వంగా ఉంది" అని స్పోకేన్ మేయర్ Lisa Brown అన్నారు. “మా Office of Civil Rights, Equity, and Inclusion (ఆఫీస్ ఆఫ్ సివిల్ రైట్స్, ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజన్) దాని అభివృద్ధికి పాటుపడడం ద్వారా అటార్నీ జనరల్ టీమ్‌తో కలిసి పనిచేస్తోంది, మా కమ్యూనిటీ అంతటిలో మేము దీనిని రిపోర్టింగ్ మెరుగుపరచే, జవాబుదారీతనాన్ని పెంచే ఒక కీలక సాధనంగా చూస్తున్నాము” అని ఆమె అన్నారు.
“Hate Crimes Hotline కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడంలో స్పోకేన్ కౌంటీ ముందు ఉండడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను" అని స్పోకేన్ కౌంటీ కమిషనర్ Amber Waldref అన్నారు. “ద్వేష నేరాలుగా మారగల సంఘటలను నివేదించే కొత్త అవకాశాన్ని మన సమాజంలోని నివాసులకు ఈ సాధనం సృష్టిస్తోంది, దానివల్ల సమాజంలో ప్రతీ ఒక్కరూ క్షేమంగా, భద్రంగా ఉండగలుగుతారు” అని ఆయన అన్నారు.
"ద్వేష సంబంధిత నేరాలను ప్రజలు భయం లేకుండా నివేదించడానికి ఈ హాట్‌లైన్ ఒక కీలక అడుగు" అని క్లార్క్ కౌంటీ షెరీఫ్ John Horch అన్నారు. “వారి అభిప్రాయానికి విలువ ఉందని, వారికి సహాయం అందుబాటులో ఉందని మా కమ్యూనిటీలోని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము” అని ఆయన అన్నారు.
“"ఆసియా, నేటివ్ హవాయి మరియు పసిఫిక్ ఐలాండర్ సమాజాలు వందల ఏళ్లుగా ద్వేష సంబంధిత నేరాలు, వివక్ష సంఘటనలు ఎదుర్కొంటున్నాయి, మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఈ పరిస్థితి మరింత విషమించింది” అని HAPPEN Business Resource Group కో-చెయిర్ Thanh Tran అన్నారు. “ఇలాంటి సంఘటనలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నప్పటికీ, ప్రధాన స్రవంతి వార్తల్లో వీటి గురించిన ప్రస్తావన పెద్దగా ఉండడం లేదు. బాధితులు తమకు ఎదురైన సంఘటనలు నివేదించేలా ఈ హాట్‌లైన్ ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నాను. దానివల్ల మనం సమాజాన్ని శక్తివంతం చేయగలము మరియు న్యాయం, స్వస్థత వైపు ముందుకు సాగగలం” అని ఆయన అన్నారు.
“ఈ హాట్‌లైన్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే, మన కమ్యూనిటీలకు ఎప్పటి నుండో తెలిసిన ఒక విషయాన్ని ఇది గుర్తిస్తుంది. అది: కేవలం భౌతిక హాని, ఆస్తి నష్టం జరిగితేనే అది ద్వేషం అనే సంకుచిత చట్ట నిర్వచనాలు చెప్తాయి, ద్వేషం కేవలం అలా మాత్రమే కనిపించదు" అని Washington Immigrant Solidarity Network ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Catalina Velasquez అన్నారు. “నా నెట్‌వర్క్‌లోని వలస కుటుంబాలు వారి పిల్లలను పాఠశాలకు పంపడానికి భయపడేలా చేసే మాటల రూపంలోని వేధింపులు ఎదుర్కొంటుండడం, ముదురు రంగుల జాతుల్లోని ట్రాన్స్‌జెండర్‌లు ప్రతీరోజు చాలా చిన్నచిన్న వివక్ష సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు, ఆ పరిస్థితి వాళ్ల వ్యక్తిత్వాలని చిధ్రం చేస్తుండడం, 'మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే వెళ్లిపోండి' అని మన వయోవృద్ధులను బెదిరిస్తుండడం — ఇవన్నీ మన భౌతిక పరిస్థితులను, మన ప్రపంచంలో సురక్షితంగా జీవించే మన సామర్థ్యాన్ని దెబ్బతీసే హింసాత్మక చర్యలు. ఈ అనుభవాలను నమోదు చేయడానికి, విశ్వసించడానికి మరియు సాంస్కృతికంగా సమర్థవంతమైన, గాయం-గురించి తెలిసిన సంరక్షణతో స్పందించడానికి హాట్‌లైన్ ఒక వేదికను సృష్టిస్తుంది” అని ఆయన అన్నారు.
“ద్వేషానికి గురైన బాధితులు తమ స్థానిక సమాజాల్లో తమకు మద్దతు ఉందని భావించడానికి హాట్‌లైన్ వీలు కల్పిస్తుందని నేను ఆశిస్తున్నాను” అని Human Rights Spokane బోర్డు మెంబర్ Hershel Zellman అన్నారు. “హాట్‌లైన్ ద్వారా సేకరించిన గణాంకాలనేవి ద్వేషం చూపించే అవకాశాన్నే తగ్గించడానికి తోడ్పడే అవగాహనా కార్యక్రమాలు మరియు చట్ట అమలు వ్యూహాలు రూపొందించేందుకు ఉపయోగించబడతాయని కూడా నేను ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు.
“ఈ హాట్‌లైన్ అనేది సాంస్కృతికంగా ఒక సమర్థవంతమైన మద్దతు అందిస్తుందని, ముస్లిం సమాజంలో నమ్మకం పెంచుతుందని, సంఘటనలు నివేదించడానికి ఎక్కువమంది సమాజ సభ్యులను ప్రోత్సహిస్తుందని మేము ఆశిస్తున్నాము" అని వాషింగ్టన్ రాష్ట్రంలోని Council on American-Islamic Relationsలో లీగల్ అడ్వకేట్‌గా ఉన్న Sabrene Odeh అన్నారు. “ఇస్లామోఫోబియాను బాగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో సమాజం ముందు జరిగే కార్యక్రమాలు, ప్రయత్నాలు మరింత ఖచ్చితంగా ఉండడానికి, మా సమాజ సభ్యుల్లో మంచి స్పందన రాబట్టే బలమైన మద్దతు అందించడానికి వీలు కల్పిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ హాట్‌లైన్ అభివృద్ధి మరియు అమలులో ముస్లిం సమాజం ప్రాతినిధ్యం వహించడం వల్ల ముస్లింల భద్రతకు ప్రాధాన్యత, విలువ ఇవ్వబడుతుందనే సందేశం బలపడుతుంది” అని ఆయన అన్నారు.
“మేము సేవ చేస్తున్న సమాజానికి మా సంస్థ ఒక నమ్మకమైన దూత" అని Washington West African Center ప్రోగ్రామ్స్ డైరెక్టర్ Momodou Jobe అన్నారు. “మా కమ్యూనిటీ మాకు చెప్పే విషయాలనే మేము వ్యక్తం చేస్తాము, హాట్‌లైన్ అభివృద్ధి చేయడంలో మా భాగస్వామ్యం అనేది మా కమ్యూనిటీ అభిప్రాయాలను ఒక చోటుకి తీసుకువచ్చింది” అని ఆయన అన్నారు.
“యూదుల మీద పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా యూదుల సమాజంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లందరికీ వనరులు, సేవలు పెరగాలి" అని పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోని Anti-Defamation League ప్రాంతీయ డైరెక్టర్ Miri Cypers అన్నారు. “K-12 పాఠశాలల్లో వివక్ష సంఘటనలతో పోరాడుతున్న మా చిన్నారులు మొదలుకొని బెదిరింపులు ఎదుర్కొంటున్న మా కమ్యూనిటీ సంస్థల వరకు, ఈ హాట్‌లైన్ సాంస్కృతికంగా సున్నితమైన మద్దతు అందిస్తుంది” అని అన్నారు.
“అందరికీ న్యాయం, సమానత్వం కోసం సిక్కు సమాజం దృఢంగా నిలబడుతుంది” అని Khalsa Gurmat Center ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Jasmit Singh అన్నారు. “వివక్ష లేదా ద్వేషం అనుభవించిన వాళ్లు తమ స్వరాలు వినిపించడానికి మరియు వారికి జరిగిన సంఘటనల గురించి చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన హాట్‌లైన్ ఒక కీలకమైన పరికరంగా ఉపయోగపడుతుందని మేము అభినందిస్తున్నాము. ఈ హాట్‌లైన్ అనేది కమ్యూనిటీలకు అధికారం అందిస్తుంది, వాషింగ్టన్ రాష్ట్రంలో విద్వేషానికి చోటు లేదనే సందేశాన్ని బలపరుస్తుంది” అని ఆయన అన్నారు.
వాషింగ్టన్‌లో ద్వేష సంబంధిత నేరాలు, వివక్ష సంఘటనల హాట్‌లైన్ గురించిన మరింత సమాచారం కోసం, atg.wa.gov/report-hateను సందర్శించండి.
నిర్వచనాలు
వాషింగ్టన్ చట్టం ప్రకారం, ద్వేష సంబంధిత నేరం అంటే ఒక వ్యక్తి ఫలానా జాతి, వర్ణం, మతం, వంశం, జాతీయ మూలం, లింగం, లైంగిక ధోరణి, లింగ వ్యక్తీకరణ లేదా గుర్తింపు, వైకల్యం ఉందని అనుకొని దాడిచేయడం, ఆస్తి నష్టం చేయడం లేదా దాడిచేస్తామనే, ఆస్తి నష్టం కలిగిస్తామనే బెదిరింపులు ఇవ్వడం అని నిర్వచించబడింది.
వివక్ష సంఘటనలనేవి నేరపూరిత స్వభావంలేని మరియు హింస, బెదిరింపులు లేదా ఆస్తి నష్టం కలిగించని వివక్షతో కూడిన చర్యలు. వివక్ష సంఘటన జరిగినప్పుడు క్రిమినల్ కేసు వేసే అవకాశం లేకపోయినప్పటికీ, వాటి గురించి నివేదించడం ముఖ్యం.
-30-
ప్రజలకు మరియు వాషింగ్టన్ రాష్ట్రానికి వాషింగ్టన్ అటార్నీ జనరల్ సేవలందిస్తారు. రాష్ట్రంలో అతిపెద్ద న్యాయ సంస్థగా, Attorney General’s Office అనేది వాషింగ్టన్‌లోని ప్రతి రాష్ట్ర సంస్థ, బోర్డు మరియు కమిషన్‌కు చట్టపరమైన ప్రాతినిధ్యం వహిస్తుంది. అదనంగా, వినియోగదారుల రక్షణ, పౌర హక్కులు మరియు పర్యావరణ పరిరక్షణ చట్టాలు అమలు చేయడం ద్వారా, ప్రజలకు ఈ కార్యాలయం ప్రత్యక్షంగా సేవలు అందిస్తుంది. వాషింగ్టన్‌లోని 39 కౌంటీల్లోని 38 కౌంటీల్లో వృద్ధులను ఇబ్బందిపెట్టడం, మెడికైడ్ మోసం మరియు లైంగిక క్రూరత ఉండే వేటగాళ్ల మీద కేసులను కూడా ఈ కార్యాలయం నిర్వహిస్తుంది. మరింత తెలుసుకోవడానికి www.atg.wa.gov సందర్శించండి.
మీడియా కాంటాక్ట్:
ఇమెయిల్: press@atg.wa.gov
ఫోన్: (360) 753-2727
జనరల్ కాంటాక్టులు: ఇక్కడ క్లిక్ చేయండి (ఇంగ్లీషు)
మీడియా రిసోర్స్ గైడ్ మరియు Attorney General’s Office తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
Other Languages